గాలికుంటు వ్యాధి టీకాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

గాలికుంటు వ్యాధి టీకాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
  • పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే ప్రాణాలకు ప్రమాదకరం
  • వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ రవి ప్రసాద్

తుంగతుర్తి ముద్ర:-పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు రైతులు సకాలంలో టీకాలు వేయించుకోవాలని తుంగతుర్తి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి ప్రసాద్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ప్రతి రైతు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తమ పశువులకు వేయించుకోవాలని లేనిపక్షంలో పశువులు ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉందన్నారు. పాలిచ్చే గేదెలకు ఆవులకు గాలికుంటు వ్యాధి సోకినట్లయితే పాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు సూడి కట్టిన పశువులు గాలుకుంటి వ్యాధి సోకినట్లయితే కడుపులో దూడలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు.అందువల్ల రైతులు గాలికుంటు వ్యాధి సోకిన పశువును సకాలంలో గుర్తించి మిగతా పశువులతో దూరంగా ఉంచాలని వెంటనే పశువైద్యశాలకు తోలుకువచ్చి వైద్యం చేయించాలని అన్నారు ప్రస్తుతం గాలికుంటు వ్యాధి లో కాకుండా ముందస్తుగా టీకాలు వేస్తున్నామని రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు 197 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇట్టి టీకా కార్యక్రమం వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు సుష్మ, బుచ్చిబాబు మహేష్ ,రైతులు ఫజారుద్దీన్ ,రాజు, కొండ వీరయ్య వెంకన్న, శీను తదితరులు పాల్గొన్నారు.