ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం .. 28 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం .. 28 మంది మృతి

ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్మోరాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా ప్రమాదానికి గురైంది. నైనిటాల్ జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.