రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు గాయాలు 

రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు గాయాలు 
  • 108 లో హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలింపు

గరిడేపల్లి ముద్ర :- గరిడేపల్లి మండలంలోని ఎల్బీనగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు తీవ్రంగా గాయాలైన సంఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్నగర్ పట్టడానికి చెందిన దద్దనాల చెరువు కాలనీకి  చెందిన వేషాల శివశంకర్,  కొడుకు వేశాల భరణి  ఇద్దరు మిర్యాలగూడలో కొత్త బైక్ ను సర్వీసింగ్ చేయించుకుని హుజూర్నగర్ వైపు వస్తుండగా ఎల్బీనగర్ సమీపంలో బైకు అదుపుతప్పి డివైడర్ కు ఢీకొట్టడంతో రోడ్డు మధ్యలో ఉన్న గ్రిల్స్ కు తగిలి కిందపడి  గాయాలయ్యాయి.

కొడుకు వేషాల భరణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, తండ్రి వేషాల శివశంకర్ కు చేయి విరిగి గాయాలయ్యాయి.  ఇద్దరినీ 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు నిమ్స్ కి తీసుకెళ్లినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు