నిర్మల్ బస్ స్టాండ్ లో అగ్నిప్రమాదం

నిర్మల్ బస్ స్టాండ్ లో అగ్నిప్రమాదం
  • రూ.3 లక్షలకు పైగా ఆస్తి నష్టం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ బస్ స్టాండ్ లో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్ స్టాండ్ లోని ఒక బేకరి తో పాటు మరో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. కాగా అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 3 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.