రాజేంద్రనగర్ లో అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్ లో అగ్నిప్రమాదం

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలోని స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఎవరికి ఎటువంటి హానీ జరగలేదు.