యువకుని హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

యువకుని హత్య కేసులో ఐదుగురు అరెస్ట్
  • వేధింపులు భరించలేక హత్య చేశాం
  • పోలీసుల ఎదుట నిందుతుల వాగ్మూలం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ముష్కే మహేష్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీస్ లు అరెస్టు చేశారు. నిందితులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా ముగ్గురు మహిళలు ఉన్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఏసీపీ నరేందర్ హత్య వివరాలను వెల్లడించారు. ముష్కే మహేష్ ను ఈనెల 25వ తేదీన పెద్దపల్లి కనకయ్య, సాయి, పద్మ, శృతి, శ్వేత కత్తి, ఇటుకతో దాడి చేసి చంపారని తెలిపారు. మృతుని తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని చెప్పారు. కనకయ్య కూతురు శృతి ,మహేష్ ఏడాది పాటు ప్రేమించుకున్నారన్నారు. 2020లో మహేష్ ప్రవర్తన నచ్చక  దూరంగా ఉందని తెలిపారు. శృతి దూరం పెట్టిందనే కక్షతో శృతితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించగా తండ్రి కనకయ్య దృష్టికి తీసుకువెల్లగా ఆయన మహేష్ ను మందలించాడని తెలిపారు.

2022 జూన్ 13వ తేదీన శృతి న్యూడ్ వీడియోను ఫెస్బుక్, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా జైపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని అన్నారు. సోషల్ మీడియాలో శృతి వీడియో లు చూసిన భర్త అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మహేష్ రోజు ఇంటి ముందు నుంచి వాహనంపై వెళ్తూ హారన్ కొట్టడం, మానసికంగా వేధించడం, అల్లుని చావుకు కారణమై కూతురు జీవితాన్ని నాశనం చేశాడనే కోపంతో మహేష్ ను హత్య చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారన్నారు.  పది రోజుల క్రితం గోదావరి ఖనిలో కనకయ్య కత్తి కొనుగోలు చేసి పథకం ప్రకారం మహేష్ ను అడ్డగించి కత్తి తో, సిమెంట్ ఇటుకతో దాడి చేసి హత్య చేశారని తెలిపారు. మహేష్ మృతి చెందిన తర్వాత పారిపోగా గురువారం తెల్లవారుజామున షెట్ పల్లి గ్రామం వద్ద అరెస్టు నిందితుల నుంచి కత్తి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ సీఐ.రాజు పాల్గొన్నారు.