పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలు , నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి 

పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలు , నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి 
  • పిడిఎస్ యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్


ముద్ర న్యూస్ నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ  పరిధిలోని సర్వే నంబర్ 243,244 ప్రభుత్వ స్థలంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ అధ్వర్యంలో పేదలు, వలస కూలీలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణానికి రూ 5 లక్షలు మంజూరు చేయాలని పిడిఎస్ యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వాస పల్లయ్య లు డిమాండ్ చేశారు. గురువారం నేరడుచర్లలో 243.254సర్వే నెంబర్లలో గుడిసెలు వేసిన స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న సుమారు 250 మంది పేదలు,కూలీలు గత 6 సంవత్సరాల నుండి ఇళ్ల స్థలాలు,ఇండ్ల మంజూరి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

వీరంతా చుట్టూతా గ్రామాల నుండి పది సంవత్సరాల క్రితం వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ బ్రతుకులు వెల్లదీస్తున్నారని, ఇండ్లు కిరాయికి దొరక్క, దొరికినా కిరాయి కట్టలేక  చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై అనేకమార్లు ఎమ్మార్వో, ఆర్డిఓ, కలెక్టర్ కు నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యమైందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇప్పించాలని  డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో పేదలకు ఇల్లు వచ్చేంతవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్డి.హుస్సేన్, పిఓడబ్ల్యు నియోజవర్గ కన్వినర్ సందా సత్తమ్మా, మరియమ్మ, మల్లీశ్వరి, పావని,లక్షి,సోమమ్మ,సుజాత, ఫాతిమా, మాలంబి,శ్యామల, సుమలత,దుర్గయ్య,గోపి,లక్ష్మయ్య, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.