శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో ఫ్లోరింగ్( గ్రానైట్) నిర్మాణం

శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో ఫ్లోరింగ్( గ్రానైట్) నిర్మాణం
  • మూడు లక్షల 50 వేల రూపాయలు విరాళం అందించిన దాత

ముద్ర.వీపనగండ్ల:- మండల పరిధిలోని సంగినేనిపల్లి శివారులో కొండగట్టుల మధ్య ప్రకృతి సిద్ధంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పలువురు దాతలు విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. కొండల్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి గత కొన్ని సంవత్సరాల క్రితం భక్తులు అంతంత మాత్రమే వస్తుండగా, కాలక్రమమైన దాతల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందడంతో భక్తుల తాకిడి కూడా ఎక్కువైంది.

ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం రోజు సంగినేనిపల్లి గ్రామస్తులు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఏటా భక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహకారం అందించడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం జరుగుతుంది. గ్రామానికి చెందిన కట్ట శ్రీనివాస్ రెడ్డి, కట్ట కృష్ణవర్ధన్ రెడ్డిలు వారి తండ్రి కట్ట బాల్ రెడ్డి కట్ట అనసూయమ్మ జ్ఞాపకార్థం మూడు లక్షల 50 వేల రూపాయలతో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద మెట్ల మార్గం, ఆలయం ముందు ఫ్లోరింగ్ ( గ్రానైట్ తో) నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు.ఫ్లోరింగ్ నిర్మాణం పూర్తి కావడంతో ఆలయానికి వచ్చే భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.