తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కమిషన్ ప్రధాన కర్తవ్యం. ఇందులో ఒక ఛైర్మన్, ముగ్గురు సభ్యులు బృందంగా కలిసి పనిచేయనున్నారు.
కాగా విద్యా కమిషన్ ఛైర్మన్, సభ్యులను త్వరలోనే ప్రభుత్వం నియమించనుంది. గతంలోనే అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్య బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టంచేశారు. ఇందుకోసం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో గతంలో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే.