రైతుల పొలాల వద్దకు గులాబీ దళపతి

రైతుల పొలాల వద్దకు గులాబీ దళపతి
  • సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వెలుగు పల్లి గ్రామంలో గోదావరి జలాలు రాక ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
  • దుఃఖంతో ఉన్న రైతులను ఓదార్చిన కేసీఆర్
  • పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందాం
  • రైతులు ధైర్యం కోల్పోవద్దు పోరాటం చేద్దాం
  • 24 గంటల కరెంటు సాధిద్దాం
  • మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

తుంగతుర్తి ముద్ర:-సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి గ్రామంలో ఎండిపోయిన వరిపైర్లను మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ ఆదివారం పరిశీలించారు .ఈ సందర్భంగా ఎండిపోయిన పంట పొలాలను చూసి రైతుల గోస చూసి కేసీఆర్ చెలించి పోయారు .

ఈ సందర్భంగా పలువురు రైతులు తమ పంట పొలాలు ఎండిపోయిన తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. గడిచిన ఐదారు సంవత్సరాలుగా గోదావరి జలాలు రాకతో తుంగతుర్తి ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉందని చెరువులు చెరువులు కుంటలు గోదావరి జిల్లాలతో నిండిపోయాయని పంటలు పుష్కలంగా పండాయని రైతులు తెలిపారు. ఈ సంవత్సరం గోదావరి జలాలు రాక చెరువులలో కుంటలలో నీరు చుక్క లేకుండా పోయాయని దీంతో బావులు బోర్లు ఎండిపోయి వేసిన వరినట్లు అన్ని ఎండిపోయాయని తెలిపారు. ఎండిపోయిన పంట పొలాలు తీరును రైతులు తెలుపుతుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చలించి పోయారు. పలువురు మహిళా రైతులు పంటలు ఎండిపోవడంతో తాము ఎలా జీవించాలని తమని ఆదుకునే వారు ఎవరని కెసిఆర్ తో మొరపెట్టుకున్నారు .గడచిన ఐదారు సంవత్సరాలుగా ఎస్సారెస్పీ కాలువల్లో నిండుగా నీరు వచ్చిందని నేడు గోదావరి జిల్లాల రాక కాలువలు వెలవెల పోతున్నాయని రైతులు ఆవేదనతో తెలిపారు .వ్యవసాయ బావులకు కరెంటు కూడా సక్రమంగా రావడం లేదని రైతులు తెలిపారు. రైతుల గోస విన్న కేసీఆర్ రైతులు అధైర్యపడవద్దని 24 గంటల విద్యుత్తు తిరిగి తెచ్చుకుందామని మళ్లీ గోదావరి జలాలు కాలువల్లో నిండుగా ప్రవహించేలా వచ్చేలా ఉద్యమిద్దమని అన్నారు.

బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లవేళలా అన్నదాతకు అండగా ఉంటుందనిరైతులు ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు .కేసీఆర్ పర్యటన ఆధ్యాంతం రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ వెంట మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ,మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి లతోపాటు పలువురు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.