బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన మండ్ల ఆంజనేయులు కు శస్త్ర చికిత్స జరగడంతో బాధితుడిని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.అలాగే కొత్త పేట మాజీ సర్పంచ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల రమేష్ ఇటివల గుండెపోటుతో మృతి చెందారు.మృతుడి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.అనంతరందావుత్ ఖాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నాగేష్ నాయుడు నాయనమ్మ కొంకల నాగమ్మ మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యులను,చిక్కేపల్లి గ్రామ మాజీ వార్డు సభ్యులు బోయ కృష్ణయ్య ఇటీవల గుండె పోటుతో మృతి చెందాడు.

మృతుల కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.మాజీ ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటయ్య నాయుడు,గోపాల్ రెడ్డి, రంగాపురం శివారెడ్డి,రాజేష్ రెడ్డి,బాలస్వామి యాదవ్,భాస్కర్ రెడ్డి,తిలకేశ్ గౌడ్, నరసింహ,ప్రవీణ్ రెడ్డి,రాంబాబు నాయక్, నవీన్ రెడ్డి,,శ్రీనివాసులు,,రాంబాబు,అశోక్,,స్వామి,,రాములు,,వెంకట్ రాములు,,ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.