చదువుల తల్లికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి
- ముద్ర పత్రిక వార్తకు స్పందించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి ముద్ర:- మండల పరిధిలోని వెంపటి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన సిగ గౌతమి ఇటీవల నీట్ ఫలితాల్లో మంచిర్యాంకు సాధించి ఎంబీబీస్ లో స్థానం సాధించగా కాలేజీలో చేరడానికి ఫీజు కట్టలేక కూలి పనికి వెళుతున్న ఆ బిడ్డ వ్యధను ముద్ర పత్రిక వార్తా కథనం ద్వారాతెలుసుకున్న తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆ విద్యార్థికి హైదరాబాదులోని తన నివాసంలో రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టపడి చదువుకొని పెంచిన నానమ్మ తాతయ్యలకు మంచిపేరు తేవాలని, డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని విద్యార్థికి సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తునికి సాయిలు, కొండగడుపుల నాగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు దేశ బోయిన హరీష్ యాదవ్, జెక్కి సతీష్, విద్యార్థిని బాబాయి సిగ మధు తదితరులు పాల్గొన్నారు.