పోలీసుల అదుపులో మావోయిస్టు పార్టీ మాజీ నేత

పోలీసుల అదుపులో మావోయిస్టు పార్టీ మాజీ నేత

ముద్ర, జమ్మికుంట:-కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మావోయిస్టు పార్టీకి చెందిన మాజీ నేత అదృశ్యం కలకలం రేపింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న ఆయన దాదాపు 12 ఏళ్ల క్రితం అరెస్ట్ అయ్యారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యునిగా, ఝార్ఖండ్ రాష్ట్రంలో బొగ్గు గని కార్మిక సంఘం బలంగా చేస్తున్న మహ్మద్ హుస్సేన్ రియాజ్ అలియాస్ సుధాకర్, అలియాస్ రమాకాంత్ అరెస్ట్ అయ్యారు. పెరాలిసిస్ బారిన పడడంతో చికిత్స చేయించుకునేందుకు జార్ఖండ్ పంపిన అధిష్టానం బొగ్గు గని కార్మిక సంఘం బాధ్యతలను అప్పగించింది.

ఈ కోరనే అరెస్ట్ అయిన సుధాకర్ 10 క్రితం బెయిలుపై బయటకు వచ్చిన ఆయన స్వగ్రామం జమ్మికుంటలో సాధారణ జీవనం గడుపుతున్నారు. అయితే అనూహ్యంగా సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. సింగరేణి కార్మిక సమాఖ్య నిర్మాణంలో నల్ల ఆదిరెడ్డితో పాటు కీలక భూమిక పోషించారు. మూడు దశాబ్దాల పాటు పార్టీలో పని చేసిన సుధాకర్ పదేళ్ల క్రితం జనజీవనంలోనే కొనసాగుతున్నారు. అయితే ఆయనను ఉన్నట్టుండి ఎత్తుకెళ్లడం ఏంటన్న చర్చ మొదలైంది.