జార్ఖండ్ లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్ లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లో భారీ సోమవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్‌ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అశుతోశ్‌ శేఖర్‌ చెప్పారు. ఆప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని ఆయన తెలిపారు.