నకిలీ నోట్ల చలామణి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ 

నకిలీ నోట్ల చలామణి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ 
  • రూ.7.95 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
  • కేసు వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి
వికారాబాద్ , ముద్ర ప్రతినిధి: నకిలీ నోట్లు చలామణి చేసి నలుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ  నారాయణ రెడ్డి  శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు తాండూర్ పట్టణంలోనీ రైల్వే స్టేషన్ సమీపంలో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని అయ్యప్ప నగర్ లో నివసించే మండిగి చంద్రయ్య వయస్సు 51 సం, వృత్తి : బండల వ్యాపారం,  పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద 500 రూపాయల నకిలీ నోట్లు 90 స్వాధీనం చేసుకొని నిందితుని పైన కేసు నమోదు చేసుకొని అతని సమాచారం మేరకు మిగతా నిందితులు అయిన 1. ఇచ్చాపురం జగదీష్, 2. బడుగంటి వీర వెంకట రమణ  3. ప్రగళ్లపాటి శివకుమార్ పోలీసులు పట్టుబడ్డారు. వీరు ఇచ్చాపురం జగదీష్ నివాసం ఉండే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా , దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిడది  లోని మల్లంపేట లో వృషభాద్రి అపార్ట్మెంట్లో ఉండగా అదుపులోకి తీసుకొని వారి వద్దనుండి నకిలీ 500 రుపాయల నోట్లు 1500  విలువ మొత్తం 7,50,000 రూపాయల తో పాటు నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ మానిటర్, సి పి యు ప్రింటర్, పేపర్లు, రిబ్బన్ మరియు 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోడం జరిగింది. 
నిందితుల నేర చరిత్ర
1.మండిగి చంద్రయ్య, వయస్సు 51 సం, వృత్తి బండల వ్యాపారం, కులం  ముదిరాజ్, నివాసం ఇంధర్ చెడ్, బషీరాబాద్ మండలం  ప్రస్తుత నివాసం అయ్యప్ప నగర్, తాండూర్ వికారాబాద్ జిల్లా.
2.జగదీష్ వయస్సు 42 సం, కులము చాకలి, వృత్తి మాజీ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మార్కెటింగ్ నివాసం సుంకరిపేట విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్  ప్రస్తుత నివాసం మల్లంపేట బాచుపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. 
గత నేర చరిత్ర :- గతంలో  ఇతను బ్యాంక్ ఆఫ్ బరోడా జహీరాబాద్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నపుడు బ్యాంక్ నిధులను దుర్వినియోగం చేసినందుకు ఇతనిపై సంగారెడ్డి జిల్లా  జహీరాబాద్ పోలీస్ స్టేషన్నందు కేసు నమోదు కాగా ఒక నెల సంగారెడ్డి జిల్లా కంది జైలు లో ఉన్నాడు.
3.బడుగంటి వీర వెంకటరమణ  వెంకీ  వయస్సు 27 సం, వృత్తి వెల్డర్ కులము పద్మశాలి నివాసము నరసాపురపుపేట గ్రామం, రామచంద్రాపురం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ప్రదేశ్.  
గత నేర చరిత్ర :- గతంలో ఇతను నకిలీ నోట్లు చలామణి చేసినందుకు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నందు కేసు నమోదు అయ్యింది. అలాగే గంజాయి అక్రమ రవాణా చేసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ నందు కేసు కాగా మూడు నెలలు సంగారెడ్డి జిల్లా కంది జైలు లో ఉన్నాడు. అప్పుడు ఇతనికి జైలులో ఇచ్చాపురం జగదీష్ తో పరిచయం ఏర్పడింది. అలాగె వడ్యాది మాడుగుల పోలీస్ స్టేషన్ అల్లూరి సీతరామరాజు జిల్లా నందు కూడా గంజాయి అక్రమ రవాణా చేసినందుకు కేసు నమోదు అయింది . 
4.ప్రగల్లపాటి శివకుమార్  వయస్సు 43 వృత్తి ఫోటోగ్రాఫర్ కులము వైశ్య నివాసము తమరాడ గ్రామము కిర్లంపూడి మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్.
స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు:-
1. 1590 నకిలీ 500 రూపాయల నోట్లు విలువ Rs 7,95,000/-
2. కంప్యూటర్, ప్రింటర్, పేపర్, రిబ్బన్ 
3. మొబైల్ ఫోన్లు 
నకిలీ నోట్ల చలామణి పైన చట్టరీత్యా కటినమైన చర్యలు ఉంటాయి అని జిల్లా ఎస్పీ తెలిపారు. నిరక్షరాస్యులు, చిరు వ్యాపారులు, వృద్ధులు మరియు రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలను, లక్యంగా చేసుకొని  నేరస్తులు దొంగ నోట్లను చలామణి చేస్తుంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగ నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి అని ఎస్పీ తెలిపారు.
తాండూరు డి.ఎస్.పి  బాలకృష్ణ రెడ్డి    అధ్వర్యంలో  జి.సంతోష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తాండూర్ టౌన్ ఎస్ ఐ  రాములు, హెడ్ కానిస్టేబుల్ అంజద్, పోలీస్ కానిస్టేబుల్. శివ కుమార్, సాయప్ప , షబీల్ ,  ప్రభులింగం  లు నిందితులను మరియు నకిలీ కరెన్సీ పెట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినారు. వారికి తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని ఎస్పి తెలిపారు.