మట్టి మిద్దె కూలి నలుగురు మృతి...

మట్టి మిద్దె కూలి నలుగురు మృతి...
  • మృతులంతా ఓకే కుటుంబం వారు.
  • తల్లితో పాటు ముగ్గురు పిల్లలు మృతి
  • తండ్రికి తీవ్రగాయాలు.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం .. గొడుగు భాస్కర్, పద్మ (28)భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు పప్పి (6) వసంత (7) కుమారుడు విక్కీ (ఏడాది మూడు నెలలు) ఉన్నారు.

భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి అర్థరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు అక్కడికి అక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటన స్థలానికి నాగర్ కర్నూల్ పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.