గంజాయి పై ఉక్కు పాదం

గంజాయి పై ఉక్కు పాదం
  • గంజాయి అమ్మినా, కొన్నా, ఉపయోగించినా కఠిన చర్యలు
  • గంజాయి తాగుతున్న, అమ్ముతున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్... రిమాండ్
  • సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి రాజశేఖర్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- గంజాయిని ఎవరైనా అమ్మిన కొన్న ఉపయోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని గంజాయిని గంజాయి పై ఉక్కు పాదం మోపుతామని సూర్యాపేటలో పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ చెప్పారు. గురువారం సాయంత్రం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గంజాయి తాగుతున్న, అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. గురువారం ఉదయం 06 గంటల సమయమున సూర్యాపేట పట్టణములోని ఈనాడు ఆఫీస్ దగ్గర ముగ్గురు వ్యక్తులు గంజాయి తాగుతూ ఉండగా, అలాగే మరొక వ్యక్తి గంజాయిని అమ్ముతుండగా వారిని సూర్యపేట పట్టణ ఎస్సై రవీందర్ తో పాటు సిబ్బంది అందరమూ కలిసి వారిని, వారివద్ద ఉన్న 100 గ్రాముల గంజాయితో సహా పట్టుకోవడం జరిగింది అన్నారు. ఇకమీదట ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినా వారిపై చట్టరిత్యా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  నిందితులు షేక్ నసీర్, బవర్ రోహిత్, దోరేపల్లి శివకుమార్,  జాదవ్ విటల్  లను రిమాండ్ కు తరలించగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని సిఐ రాజశేఖర్ వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సై రవీందర్ సిబ్బంది నరేష్ సైదులు తదితరులు పాల్గొన్నారు.