లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ముద్ర, ప్రతినిధి ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజన్నపేట గ్రామంలో 53 మంది స్థానికులకు ఉచితంగా బిపి,షుగర్ నిర్ధారణ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. బీపీ షుగర్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగింది.నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్ వచ్చినటువంటి నలుగురిని హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగిందిఅని అన్నారు.
ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ రాజన్నపేట గ్రామంలో పలువురికి ఉచిత బిపి షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అయినవారికి తగు సూచనలు జాగ్రత్తలు తెలపడం జరిగిందని, బీపీ షుగర్ తో బాధపడుతున్న వారు డాక్టర్ల సలహాలు తప్పకుండా పాటించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయ్యావుల రామచంద్రం, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, రాజన్నపేట సర్పంచ్ ముక్క శంకర్, లయన్స్ క్లబ్ బాధ్యులు నాగరాజు, బాలయ్య మొదలగు వారు పాల్గొన్నారు.