డీఎస్సీ కి సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కు ఉచితంగా మెటీరియల్ పంపిణీ

డీఎస్సీ కి సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కు ఉచితంగా మెటీరియల్ పంపిణీ

ముద్ర.వనపర్తి:-వనపర్తి జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో సాయమ్మ - బుచ్చన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం 2000 మందికి ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. విజేత కాంపిటీషన్స్ పబ్లికేషన్స్ చైర్మన్ సాయిబాబు, హైకోర్టు,సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ కె వెంకటరావు జ్యోతి ప్రజ్వలనం చేశారు. మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల డైరెక్టర్ జి శ్రీనివాస్, TRASMA అధ్యక్షులు పాపయ్య నాయుడు, వనపర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస గౌడ్, సిటిజన్ ఫోరం అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, కళాభినందన్ సంస్థ అధ్యక్షులు ఎం బాలస్వామి, యాదవ సంఘం నాయకులు చిన్నయ్య, వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ డి స్వప్న,ప్రిన్సిపాల్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కీర్తిశేషులు మీరాశి పల్లె గొల్ల బుచ్చన్న విగ్రహాన్ని కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎదిగినంత మాత్రాన సరిపోదు సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలని ఉద్దేశంతో నిరుద్యోగ యువకులకు గతంలో కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ కోసం మెటీరియల్ పంపిణీ చేశామని, ఇప్పుడు డీఎస్సీ కోసం సిద్ధం చేసిన మెటీరియల్ పంపిణీ చేస్తున్నామన్నారు. సేవలను వక్తలు కొనియాడారు.కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ కుమారి పద్మారాణి తదితరులు పాల్గొన్నారు.