విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ - తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ని సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక కరెంట్ బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లించనుంది.
ఉపాధ్యాయ దినోత్సవం వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం విద్యుత్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్ పై కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తుంది
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) September 5, 2024
విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుంది. pic.twitter.com/hvpAt2QVTo