ఆర్.ఎస్.ఎస్ సేవాభారతి ద్వారా ఉచిత ఆపరేషన్లు

ఆర్.ఎస్.ఎస్ సేవాభారతి ద్వారా ఉచిత ఆపరేషన్లు

మునగాల ముద్ర:-వివేకానంద సేవాభారతి హాస్పిటల్, కొక్కిరేణి గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా ద్వారా డాక్టర్ మారుతీ శర్మ  సహకారంతో కామినేని  హాస్పిటల్ లో రంగాపురం, తిమ్మారెడ్డి గూడెం, చాకిరాల గ్రామాల నుండి ముగ్గురు పేషెంట్స్ కి ఒకరికి గుండె ఆపరేషన్ , ఒకరికి వెన్నుపూస ఆపరేషన్, మరొకరికి కిడ్నీ ఆపరేషన్ ఉచితంగా చేయిస్తున్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద ప్రజలను "కొక్కిరేణి వివేకానంద సేవాభారతి హాస్పిటల్" ఇంచార్జి కేశగాని రవి బాధ్యత తీసుకొని ఈ ఆపరేషన్ చేయిస్తున్నారుసేవాభారతి తమ బాధ్యత తీసుకొని ఉచితంగా ఈ ఆపరేషన్లు చేయిస్తున్నందుకు ముగ్గురు పేషెంట్లు మరియు వారి కుటుంబ సభ్యులు సేవాభారతికి మరియు కేశగాని రవి కృతజ్ఞతలు తెలియజేశారు.