సూర్యాపేట డిఎస్పీగా జి రవి

సూర్యాపేట డిఎస్పీగా జి రవి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:- సూర్యాపేట డిఎస్పీగా గొల్లూరి రవి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు.  సూర్యాపేట డిసిఆర్బి నుండి సూర్యాపేట డిఎస్పీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట డిఎస్పీగా పనిచేస్తున్న పరిక నాగభూషణం డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.గతంలో జి రవి సూర్యాపేట టౌన్ ఎస్సైగా గా, నల్గొండ, తుంగతుర్తి సీఐగా పనిచేశారు. డిఎస్పీగా రవి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.