గద్వాల్ సర్కిల్ కార్యాలయాన్ని   తనిఖీ చేసిన జిల్లా డి. ఎస్పీ ఎన్. సి హెచ్ రంగ స్వామి

గద్వాల్ సర్కిల్ కార్యాలయాన్ని   తనిఖీ చేసిన జిల్లా డి. ఎస్పీ ఎన్. సి హెచ్ రంగ స్వామి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :గద్వాల వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా డి.ఎస్పీ ఎన్. సి హెచ్ రంగస్వామి, గద్వాల్ పట్టణం లోని గద్వాల్   సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని   సందర్శించి  సర్కిల్ కార్యాలయ  రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేశారు. అందులో భాగంగా సర్కిల్ పరిధిలో   నమోదు అవుతున్న గ్రేవ్  కేసుల వివరాలను, సర్కిల్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ నిర్వహణ ఎలా అమలవుతుంది, గత సంవత్సరం లో సర్కిల్ పరిధిలో ఏ ఏ పోలీస్ స్టేషన్ లో  ఎన్ని కేసులు నమోదు అయ్యావి, ఎన్ని కేసులలో నిందితులకు శిక్షలు పడ్డవి, సర్కిల్  పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ ఏ ప్రాంతాలలో నేరాలు, రోడ్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితులు ఏవిధంగా ఉన్నవి తదితర వివరాలను సి ఐ చంద్ర శేఖర్ ని  అడిగి తెలుసుకున్నారు.
అలాగే కార్యాలయం లోని  5 యస్ అమలు తీరును, గ్రేవ్ కేసులకు సంబంధించి  సీసీటీన్స్ ప్రాజెక్ట్ ఆన్ లైన్ లో పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటాను, పిటిషన్ ఫైల్ లో ఉన్న ఎంక్వేరి రిపోర్ట్ ను పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని  పోలీస్ స్టేషన్ల లో నమోదయిన గ్రేవ్ కేసుల సి. డి ఫైల్స్ ను, క్రైమ్ మెమోస్, క్రైమ్ డైజెస్ట్ రికార్డ్ లను, పి. టి    కేస్ ఫైల్స్ ను, యు ఐ కేసుల ఫైల్స్ ను  పరిశీలించారు.  పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని ప్రతి సిడి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని , గ్రేవ్ కేసులలో యు ఐ ని తగ్గించాలని సి. ఐ ని ఆదేశించారు. గ్రేవ్ కేసుల విషయం లో  సిసిటిఎన్ఎస్ ప్రాజెక్టులో నమోదు చేస్తున్న ఎఫ్ఐఆర్, సిడిఆర్, పార్ట్ వన్, పార్ట్ టు, డిమాండ్ డైరీ, చార్జిషీట్, ఇంటరాగేషన్ రిపోర్ట్స్ ను ఆన్ లైన్లో ఎంట్రీ అవుతున్న తీరును  పరిశీలించారు.

సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో  డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య ను పరిష్కరిoచేటట్లు చూడాలని, అలాగే బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ  నిర్వహించేటట్లు ఆయా ఎస్సై ల ద్వారా  చర్యలు చేపట్టాలని సి.ఐ కి  సూచించారు. తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును, 5యస్ అమలు తీరు, ఫంక్షనల్ వర్టీకల్ నిర్వహణను పర్యవేక్షించాలి అని, సర్కిల్ పరిధిలోని ఎస్సై లతో నమోదు అవుతున్న, అయిన కేసుల పై రివ్యూ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సీసీ కెమెరాల స్థాపనకు ప్రజలను ప్రోత్సహించాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని డి. ఎస్పీ, సూచించారు. కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటె తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సి. ఐ చంద్ర శేఖర్, గద్వాల్ రూరల్, ధరూర్, గట్టు  ఎస్సై లు ఆనంద్, శేఖర్ రెడ్డి, పవన్ కుమార్,  గద్వాల్ టౌన్ ఎస్సై-2 షుకుర్, ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్,  సర్కిల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.