GSLV - F14 రాకెట్ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్‌డౌన్

GSLV - F14 రాకెట్ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్‌డౌన్

ముద్ర, తెలంగాణ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ ప్రయోగం జరగనుంది.గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ఎల్‌ఏబీ) ప్రయోగ పనులకు ఆమోదం తెలిపింది.తదనంతరం,లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన ల్యాబ్ సమావేశం నిర్వహించారు.శుక్రవారం మధ్యాహ్నం 2.05 నుండి కౌంట్‌డౌన్ తర్వాత GSLV F-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.