బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలి 

బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలి 
  • ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచడంలో విఫలమైన కాంగ్రెస్
  • నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసుకు చెందారు
  • రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో  బిఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు ఖాయం
  • మే మూడవ తేదీన తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగే బి ఆర్ ఎస్ పార్టీ ర్యాలీని విజయవంతం చేయాలి
  • తుంగతుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన  బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన అసెంబ్లీ ఎన్నికల ముందు అమలు కానీ అనేక వాగ్దానాలను ప్రజలకు ఆశ చూపి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని నేడు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించారని అన్నారు.

నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర విసుగును ప్రదర్శిస్తున్నారని అన్నారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని  అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గలో BRS పార్టీ జెండాను, నాయకులను, కార్యకర్తలను కాపాడే బాధ్యత తనదనికార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని అన్నారు .రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ గారి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయిలో కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతానికి అందరు సమిష్టిగా పనిచేయాలన్నారు.హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని,అందుకని బీ.ఆర్.ఎస్ పార్టీ ని కోరుకుంటున్నారని అన్నారు. మే 3వ తారీఖు ఉదయం 12 గంటల పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ గారికి మద్దతుగా తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగే బైక్ ర్యాలిని విజయవంతం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు.జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్. మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య. తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు రఘునందన్ రెడ్డి.తుంగతుర్తి వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం. సీనియర్ నాయకులు గుండ గాని దుర్గయ్య. దొంగరి శ్రీనివాస్. గోపగాని శ్రీను. తునికి సాయిలు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.