విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు గాంధీజీ సినిమా

విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు గాంధీజీ సినిమా

ముద్ర ప్రతినిధి కామారెడ్డి:-విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు గాంధీజీ సినిమా థియేటర్లో ప్రవేశించబడుతుందని జిల్లా కలెక్టర్ పాటిల్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా    గాంధీ చిత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 9 థియేటర్ల ద్వారా 19,788 మంది విద్యార్థులు తిలకించారని   ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. చిత్ర ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం నాడు  9 సినిమా హాళ్లలో 5,352 సీట్ల సామర్థ్యానికి గాను  34 పాఠశాలలకు  చెందిన  4,290  మంది విద్యార్థులు  చిత్రాన్ని వీక్షించారని  అన్నారు.

కామారెడ్డిలోని ప్రియ 70 ఎంఎం లో 473 మంది విద్యార్థులు, ప్రియ   35 ఎంఎం లో 503, దర్శన్ లో 695, శాంతి థియేటర్లో 370 మంది విద్యార్థులు చిత్రాన్ని తిలకించారని ఆయన తెలిపారు. కాగా బాన్సువాడ లోని మహేశ్వరి థియేటర్లో 345, వెంకటేశ్వర  లో 311 మంది,  పిట్లం లోని శ్రీ వెంకటేశ్వర థియేటర్లో 560, నాగిరెడ్డిపేట లోని రామ్ ప్రతాప్ థియేటర్లో 483, బిచ్కుంద లోని పరమేశ్వరి టాకీస్ లో 550 మంది విద్యార్థిని, విద్యార్థులు గాంధీ చిత్రాన్ని తిలకించారాని కలెక్టర్ పేర్కొన్నారు. ఇట్టి చిత్రాన్ని విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు, ఇతర పౌరులు సైతం ఉచితంగా  పై థియేటర్లలో తిలకించవచ్చని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి లోని వివిధ థియేటర్లలో ప్రదర్శితమైన గాంధీ చిత్రాన్ని మండల విద్యాధికారి, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి తిలకించారు.