పుష్ప మూవీ రేంజ్ లో గంజాయి సగ్లింగ్

పుష్ప మూవీ రేంజ్ లో గంజాయి సగ్లింగ్
  • పుష్ప మూవీ రేంజ్ లో గంజాయి సగ్లింగ్
  • ఖాకీల అలెర్ట్ తో *వెర్రి "పుష్పా"లైన స్మగ్లర్ లు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- పుష్ప మూవీ స్టైల్ లో గంజాయి రవాణా చేయాలనుకున్నారు.ఒక్క లోడ్ తో లక్షలు సంపాయించాలనే ప్లాన్ వేశారు. ప్లాన్ అయితే బాగుంది కానీ పోలీసుల నిఘాతో వ్యవహారం మొత్తం బెడిసికొట్టింది. ఓ డీసీఎంలో టమాటాల లోడ్ మాటున గంజాయి ఎక్స్ పోర్ట్ చేస్తున్న ముఠాకు నల్గొండ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. టమాటా ట్రే ల మధ్య గంజాయి ప్యాకెట్లు పెట్టి వాటిని మహారాష్ట్రకు తరలిస్తుండగా నాగార్జున సాగర్ వద్ద సోమవారం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 330 కిలోల గంజాయి (168 ప్యాకెట్లు) స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ 84 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా గంజాయి అక్రమ రవాణా పై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఇల్లీగల్ ఎక్స్ పోర్ట్ చేస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.