భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు

భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్, భైంసా తదితర పలు ప్రాంతాల్లోని క్రైస్తవులు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. ఏసు క్రీస్తు సిలువ వేయబడి మనుషులను పాపం నుంచి విముక్తి చేసిన పవిత్ర దినంగా ఈ రోజును భావిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని సి ఎస్ ఐ చర్చిలలో క్రైస్తవులు పూజలు, ప్రార్థనలు చేశారు.