కార్పొరేట్ ఆసుత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు

కార్పొరేట్ ఆసుత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు

ప్రభుత్వ  ఆసుపత్రుల సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులు రూపుదిద్దుకున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కంటి ఆపరేషన్ థియేటర్ ను, నూతనంగా నిర్మించిన రేడియాలజీ ల్యాబ్ భవనాన్ని పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేతతో  కలిసి మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ  ఆసుపత్రుల సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ల్యాబ్ లో 57 రకాల పరిక్షలు చేసుకోవచ్చని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ప్రజలు వేలకు వేలు కర్చు పెట్టుకోవద్దని కోరారు. గతంలో ఆసుపత్రులు అంటే ఉస్మానియా, గాంధీ అనే చెప్పేదని కాని కేసిఅర్ వచ్చాక ప్రతిజిల్లాలో కార్పోరేట్ స్థాయి ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతకు ముందు మెడికల్ కళాశాల భవన నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అదనపు కలెక్టర్ మంద మకరంద్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంతు రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్,ఆసుపత్రి సుపరిండేంట్ రాములు, డిఎం హెచ్ ఓ శ్రీధర్, కౌన్సిలర్లు ఒద్ది శ్రీలత రామ్మోహన్, జుంబర్తి రాజుకుమారు తదితరులు పాల్గొన్నారు.
సరైన సామాగ్రి లేకుండానే ఆపరేషన్ థియేటర్ ప్రారంబించిన మంత్రి ...
ఆపరేషన్ థియేటర్లో సరైన సామాగ్రి లేకుండానే ఆపరేషన్ థియేటరును మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఎమ్మెల్యే, కలెక్టర్ తో కలిసి మంత్రి థియేటర్ను పరిశీలించారు. స్వతహాగా కంటి వైద్యుడు ఆయన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ సంబంధించిన సరైన సామాగ్రి లేకపోవడంపై వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఆపరేషన్ ఎలా చేస్తారని పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని ఆగ్రహించారు.