ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో రక్తదాన శిబిరం  

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో రక్తదాన శిబిరం  

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో హెల్త్ క్లబ్, లైఫ్ సైన్సెస్, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.  రక్తదాన శిబిరంతో పాటుగా  కళాశాల విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ పరిక్షలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ రక్త దానం  అత్యవసర సమయాలలో రక్తం దానం చేయడం మరొకరికి ప్రాణ దానం లాంటిదని పేర్కొన్నారు.   ఎనీ మియాతో బాధపడకుండా సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో పాటు  జాతీయ సేవా పథకం యూనిట్ వన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రక్త దానం చేశారు రక్తదానం చేసిన  అధ్యాపకులను, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ అభినందించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఏ జ్యోతిలక్ష్మి, జంతు శాస్త్ర ఆచార్యురాలు కే కిరణ్ మై, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం సత్య ప్రకాష్, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ వి జమున, జాతీయ సేవా పథకం జగిత్యాల జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పడాల తిరుపతి, హెల్త్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అసిస్టెంట్ మమత, వినోద్ పాల్గొన్నారు