ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి.

ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి.

హుజూర్నగర్ లో డయాలసిస్ భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్ నగర్, ముద్ర: ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో కోటి 25 లక్షలతో నిర్మిస్తున్న డయాలసిస్, బ్లడ్ స్టోరేజ్ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులు తెలంగాణ సమాజానికి వైద్యరంగంలో అవసరమైన మౌలిక వసతులు అందిస్తున్నాడని అన్నారు . డయాలసిస్ కేంద్రానికి భవనం ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గేల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ గూడెం శ్రీనివాసు, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, గాయత్రి భాస్కర్, డాక్టర్ కరణ్ కుమార్, దశరథ నాయక్, రవి గౌడ్ పాల్గొన్నారు.