నిరుద్యోగుల జీవితాలో సర్కార్ చెలాగాటం

నిరుద్యోగుల జీవితాలో సర్కార్ చెలాగాటం
  • దళితులకు న్యాయం చేయకుండా అంబేద్కర్ విగ్రహాం ఎలా ఆవిష్కరిస్తారు
  • నేరెళ్ల బాదితులకు ఇంకా న్యాయం జరగలేదు
  • టీఎస్పీఎస్సీ ని రద్దు చేయాలి.. చైర్మన్ జనార్ధన్ రెడ్డి కాల్ డేటా బయటపెట్టాలి
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ సర్కార్ చెలగాటమాడుతుందని, టెన్త్ పేపర్ లీక్ చేసిన వారిని 48 గంటల్లో గుర్తించి.. వాట్సప్ చాట్లు బయటపెట్టి అరెస్టు చేసిన ప్రభుత్వం బీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితులందరిని ఎందుకు బయటపెట్టడం లేదని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. 2017లో నేరెళ్ల ధళితులు ఇసుక లారీలు తగులబెడితే.. పోలీసులు థర్డ్ డిగ్రి ప్రయోగించి ఇప్పటికి న్యాయం చేయలేదన్నారు. పోలీసులకు శిక్ష పడేదాక ఇప్పటికి వారు పోరాటం చేస్తున్నరన్నారు. కంపనీలు ఏర్పాటు పేరుతో దళిత, బహుజనులవి వేలాది ఏకరాలు లాక్కోని కంపనీలు ఏర్పాటు చేయకుండా ఉపాధీ కల్పించకుండా కాలం గడుతుపుతున్నరన్నారు. తీసుకున్న భూముల్లో ఎన్ని కంపనీలు ఏర్పాటుచేశారని, ఎంత మందికి ఉపాధీ అకాశాలు కల్పించారని వివరాలు వెల్లడించాలని మంత్రి కేటీఆర్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. దళితులకు న్యాయం చేయని సిఎం కేసీఆర్ హైదరాబాద్ లో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాం ఎలా ఆవిష్కరిస్తరని ప్రశ్నించారు.

పేపర్ లీక్ కేసులో సీఎంవోకు సంబంధం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. లేకపోతే నిజాలు బయటపెట్టాలన్నారు. కమీషన్చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు టీఎస్పీఎస్సీ సభ్యుల కాల్ డేటా మొత్తం బయటపెట్టాలన్నారు. చాల సంవత్సరాలుగా ఈ పేపర్ లీక్ జరుగుతుందని, తప్పిదారి పోలీసులకు విషయం తెలిసి.. ఈ విషయం బయటకు వచ్చిందన్నారు. బార్లో కూర్చోనే వ్యక్తికి 120 మార్కులు వచ్చాయని, బాగా చదివిన గొల్డ్మెడల్ సాధించిన వ్యక్తికి 90 మార్కులు కూడా రాలేదంటే అర్థం అవుతుందన్నారు. రాజ్యాంగబద్దమైన టీఎస్సీఎస్సీ కమీషన్ వివరాలు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయన్న విషయాలు మంత్రి కేటీఆర్కు ఎవరిచ్చారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. సిరిసిల్ల సభలో ఈ వివరాలు ఎలా ప్రకటించారన్నారు. జనార్ధన్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు రక్షించాలని చూస్తున్నరన్నారు.సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన సిఎం కేసీఆర్ ఆ సర్వే వివరాలు ఇప్పటికి ప్రకటించలేదని, కానీ టీఎస్సీఎస్సీ ప్రకటించాల్సిన వివరాలు కేటీఆర్ ప్రకటిస్తున్నరని ఎద్దేవా చేశారు. పేపర్లీ క్స్ 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నరన్నారు. తెలంగానాను పాలించే ఆర్హత కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. టీఎస్సీఎస్సీ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బీఎస్సీ నాయకులు అంకని భాను, స్వామి, చాకలి రమేశ్, లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.