ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కానివ్వను : కలెక్టర్ సంతోష్

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కానివ్వను : కలెక్టర్ సంతోష్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ఆక్రమణలకు గురైన భూముల వివరాలను తెలుసుకుని తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, మీడియా సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో అందరి సహకారం అవసరమని కలెక్టర్ అన్నారు. ఈసమావేశంలో డీపీఆర్ ఓ సంపత్ పాల్గొన్నారు.