ప్రభుత్వం నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలి -తహసిల్దార్ ర్యాలయం ముందు ధర్నా : కాంగ్రెస్

ప్రభుత్వం నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలి -తహసిల్దార్ ర్యాలయం ముందు ధర్నా : కాంగ్రెస్

ముద్ర, ఎల్లారెడ్దిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ శనివారం ధర్నా చేసి నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలని తాసిల్దార్ జయంతి కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణానికి చెందిన నవీన్ కుమార్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష రాయడం జరిగిందన్నారు. తీరా ప్రభుత్వం ప్రిలిమినరీ రద్దు చేయడంతో తాను పరీక్ష బాగా రాశారని మళ్ళీ ప్రిపేర్ కావాలంటే ఎలా సాధ్యమని ఇక తనకు ఉద్యోగం రాదని ఆత్మహత్య చేసుకున్నాడని  ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం మాడుతుందని, నోటిఫికేషన్లు ఇచ్చి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేయడం జరుగుతుందని ఆరోపించారు.

పరీక్షలు నిర్వహించిన తర్వాత లీకేజీ అయిందంటూ పరీక్షలను రద్దు చేయడం నిరుద్యోగులతో ప్రభుత్వం చలగాటమాడుతుందన్నారు. వారం రోజుల వ్యవధిలో ఏఈ ఇంజనీరింగ్ పరీక్షలు ఏ ఓ డి జిల్లా స్థాయి అధికారి పరీక్షలు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడం కావాలని నిరుద్యోగుల తోటి చెలగాటం ఆడుతుందని నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు.  రానున్నది  కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన భరోసా ఇస్తున్నామన్నారు. నాయకులు జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దండు శ్రీనివాస్, చిన్ని బాబు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు  బానోత్ రాజు నాయక్, రమేష్, గంగన్న, రొడ్డ రామచంద్రం, ఇమామ్ ,గుర్రపు రాములు, చెట్టిపెల్లీ బాలయ్యా తదితరులు పాల్గొన్నారు