ప్రభుత్వం మాజీ మావోయిస్టులను ఆదుకోవాలి

ప్రభుత్వం మాజీ మావోయిస్టులను ఆదుకోవాలి

ముద్ర.వీపనగండ్ల:- సుదీర్గ కాలం మావోయిస్టు పార్టీలో పనిచేసి వివిధ కారణాలతో జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల అపూర్వ కలయిక కార్యక్రమం శుక్రవారం వీపనగండ్ల జరిగింది. వీపనగండ్ల కు చెందిన మాజీ మావోయిస్టు ఎత్తం కృష్ణయ్య(అలియాస్ జనార్దన్)నూతనంగా నిర్మించిన పౌల్ట్రీ షెడ్ ప్రారంభం సందర్బంగా ఈ కలయిక చోటుచేసుకుంది.

ఈ సందర్బంగా పలువురు మాజీలు తమ తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. పాలక ప్రభుత్వాలు మాజిల పట్ల చిన్నచూపు చూస్తూ మాజీలకు ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పనకు దూరం చేస్తున్నారని వాపోయారు. జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పడమే తప్ప అచరణలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల జీవనవిధనానికి అనుగుణంగా పాలక ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కార్పొరేషన్ ఋణలాలను ఇప్పించి ప్రభుత్వమే పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాళన్నారు. ప్రభుత్వం మాజీలు స్వాశక్తితో ఎదిగిలే ప్రోత్సహించిన నాడే మాజీలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మాజీల అభ్యున్నతి కోసం ఎక్ నయా భరోసా ఫౌండేషన్ ను నెలకొల్పడం జరిగిందన్నారు. కలయిక కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు  మాజీ ల సాధక బాధలు విన్నారు.