గౌడ కులస్తులకు ప్రభుత్వం అండ: మంత్రి శ్రీనివాస్ గౌడ్

గౌడ కులస్తులకు ప్రభుత్వం అండ: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ కులస్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఎక్సైజ్ ,టూరిజం శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం రాత్రి ఎం.వీఆర్ గార్డెన్ లో మంచిర్యాల జిల్లా గౌడ కులస్తులు మంత్రికి ఆత్మీయ సన్మానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌడ కులస్తుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ట్యాంక్ బండ్ పై నీరాను విక్రయించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. అమ్మకాలకు ప్రజల నుంచి ఆదరణ ఉందని తెలిపారు. కుల సంఘం భవనానికి స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ,మంచిర్యాల ,బెల్లంపల్లి ఎమ్మెల్యే దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, గీత పారిశ్రామిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్,  గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ఆత్మీయ సభకు అధ్యక్షత వహించారు.