ఘనంగా మంత్రి జూపల్లి కృష్ణారావు పుట్టినరోజు వేడుకలు
- వీపనగండ్ల లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ముద్ర.వీపనగండ్ల:- ప్రజాసేవలో అలుపెరుగని నాయకుడు పేదల సంక్షేమం కోసం శ్రమించే వ్యక్తి కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పుట్టినరోజు వేడుకలను మండల పరిధిలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. సంగినేనిపల్లిలో వనపర్తి జిల్లా ఎంపిటిసి లో ఫోరం మాజీ అధ్యక్షులు ఇంద్రకంటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇంద్రకంటి వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత పదవులు సైతం వదులుకొని రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని కృషి చేసిన నాయకుడు జూపల్లి అని, వచ్చే ఐదు సంవత్సరాలలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఇంద్రకంటి వెంకటేష్ అన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కేంద్రమైన వీపనగండ్ల లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది మెరుగు పడటంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయని ద్వారా ఆర్థిక సాయం అందజేసింది. బాధితులకు చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య,మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, మాజీ సర్పంచ్ గంగిరెడ్డి మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకటరెడ్డిలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నక్క విష్ణు, నాయకులు రవీందర్ రెడ్డి, గోపి, మహేష్ నాయుడు, వైఎస్ వెంకటయ్య, ఆదయ్య, సర్వ రెడ్డి తదితరులు ఉన్నారు