ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ముద్ర, లక్షేట్టిపేట్ : పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జెండా ఆవిష్కరణ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ నల్మాసు కాంతయ్య,  ఎం పీ డీ ఓ కార్యాలయం లో ఎంపీపీ అన్నం మంగ, పోలీస్ స్టేషన్ లో సీ ఐ కృష్ణ, న్యాయస్థానంలో న్యాయమూర్తి షరీఫ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓఝా, డీసీఎమ్మెస్ కార్యాలయంలో చైర్మన్ తిప్పని లింగయ్య, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏ ఓ ప్రభాకర్, మండల విద్యావనరుల కేంద్రంలో ఎం ఈ ఓ రవీందర్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బోనగిరి కుమార్, తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ రాఘవేంద్ర రావు జెండా ఎగురవేసి వందనం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో, కార్యాలయాలలో  జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.