వేదాంత భజన మందిరంలో ఘనంగా రధ సప్తమి వేడుకలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్ నందు గల వేదాంత భజన మందిరం నందు  రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  సూర్యభగవానుడు తన అశ్వాలతో  రధాన్ని ఉత్తరం వైపు పయనించే రోజుని దేశవ్యాప్తంగా రథసప్తమి గా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. 

దేవాలయంలో అర్చకులు ధరూరి సింగరాచార్యులు, రాఘవాచార్యులు  సూర్య భగవానునికి పూజలు నిర్వహించారు. ఆదిత్య హ్ర్రదయం పారాయణం, అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు.   అనంతరం సూర్య భగవానుడు అశ్వాలపై ఊరేగే విధంగా సూర్యప్రభ వాహనం అలంకరణ చేశారు. గుడి ఆవరణలో సూర్య భగవానునికి మహా  నైవేద్యం సమర్పించి అనంతరం భక్తులకు తీర్ద  ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. వ అనంతరం ప్రత్యేకంగా పూలతో  అలంకరించిన  సూర్యప్రభ  వాహనంలో సూర్య భగవానుని పట్టణంలోని వీధుల గుండా కోలాటాలు, భజనలతో ఊరేగింపు నిర్వహించి భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వర రావు, కార్యదర్శి నకిరకంటి నాగరాజు, కోశాధికారి సోమ అశోక్, ప, శీలా శంకర్, తదితరులు పాల్గొన్నారు.


పిల్లలమర్రిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి.విశేష పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకులు డాక్టర్ ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి నిత్య కైంకర్యం సేవలు ఆదిత్య హృదయం పారాయణం అష్టోత్తరం చేసి పాయసం నైవేద్యం సమర్పించారు.ప్రత్యక్ష దైవం సూర్య నారాయణ స్వామిని దర్శించుకుని భక్తులు పరవసించరు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజబాబు రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు అంకం బిక్షం గవ్వ జానకి రెడ్డి మహిళ భక్తులు ముడుంభై సారిక,గవ్వ విజయలక్ష్మి,ఐలమ్మ,సైదమ్మ,తదితరులు పాల్గొన్నారు.

సూర్యనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

 రాష్ట్రంలోని తొలి సూర్య క్షేత్రమైన  జాజిరెడ్డిగూడెం( అర్వపల్లి ) మండలం తిమ్మాపురం లోని అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరిగాయి. రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. సూర్యకిరణాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.