తుంగతిర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తుంగతిర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వివిధ శాఖల అధికారులు

తుంగతుర్తి ముద్ర:- 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తుంగతుర్తి మండల కేంద్రంలో త్రివర్ణ పతాకాన్ని శుక్రవారం వివిధ శాఖల అధికారులు ఆవిష్కరించారు. ఈ మేరకు తుంగతుర్తి సివిల్ కోర్టు ఆవరణంలో జడ్జి ప్రశాంతి, తహసిల్దార్ కార్యాలయంలో ఈ యాదగిరి రెడ్డి, పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్,ఎంపీడీవో కార్యాలయంలో భీమ్ సింగ్ నాయక్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏ డి ఏ జగ్గు నాయక్, విద్యాశాఖ కార్యాలయంలో బోయినీ లింగయ్య, వెలుగు కార్యాలయంలో ఏపీఎం నరసయ్య, ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీవో కృష్ణ, ఎస్ టి ఓ కార్యాలయంలో శ్రావణ్ కుమార్, ప్రాంతీయ పశు వైద్యశాలలో రవి ప్రసాద్, సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ...... రైతు సేవ సహకార సొసైటీలో సీఈఓ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు తాటికొండ సీతయ్య, బిజెపి కార్యాలయంలో అధ్యక్షులు గాజుల మహేందర్, సిపిఎం పార్టీ కార్యాలయంలో కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, పాల్గొ ని త్రివర్ణ పతాకన్న ఆవిష్కరించగా మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులు యువజన సంఘాల అధ్యక్షులు మూడు రంగుల జెండాను ఎగరవేశారు. సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. అపార త్యాగ ఫలితంగా స్వతంత్రాన్ని మరి పూర్ణం చేసి జాతీయ సమైక్యతను, సమగ్రతను, సౌబ్రా త్రుత్వాన్ని భారత రాజ్యాంగం నిర్బంధిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.