ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..

భక్తులతో కిటకిటలాడిన హనుమాన్  ఆలయాలు

ముద్ర ప్రతినిధి జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా ధరూర్ క్యాంప్ రామాలయం, పురానిపేట ఆంజనేయస్వామి, అరవింద నగర్ అభయాంజనేయ స్వామి, విద్య నగర్ రామాలయం, మార్కండేయ ఆలయంతో పాటు పలు దేవాలయాల్లో ఆంజనేయ స్వామికి పల పంచామృత అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదం అందజేసి అన్నదానం నిర్వహించారు.  జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,  ఎమ్మెల్సీ ఎల్ రమణ, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నరేష్ లు జయంతి ఉత్సవాల్లో  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.