మూడు రోజుల్లో పెళ్లి - వరుడి దుర్మరణం

మూడు రోజుల్లో పెళ్లి - వరుడి దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వచ్చే ఆదివారమే పెళ్లి.... ఇంటికి వచ్చే బంధువుల హడావిడి. మరో పక్క పెళ్లి చేసుకోబోతున్న ఆనందం... అయితే అనుకోని రీతిలో వరుడికి విద్యుత్ షాక్ తో బుధవారం మృతి చెందడంతో పెళ్లి బాజాలకు బదులు చావు డప్పు మోగింది. నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన వినోద్ పెళ్లి ఆదివారం జరగాల్సి ఉంది. కాగా బుధవారం స్నానం చేసేందుకు హీటర్ వేశాడు. అయితే వైరింగ్ లో ఎక్కడో లీకేజీ ఉండటంతో ఆయన విద్యుత్ షాక్ కు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో వారి కుటుంబంలో, బంధువుల్లో విషాదం నెలకొంది.