రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 
  • రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి  

ముద్ర. వీపనగండ్ల:- ఢిల్లీలో ఎన్నో రోజుల నుండి రైతులకు రాతపూర్వకమైన హామీ ఇచ్చిన వాటిని, కేంద్ర బిజెపి ప్రభుత్వం  అమలు చేయకుండా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని లాఠీలతో అనుచివేస్తూ ఇద్దరు రైతుల మరణానికి కారణమైన బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే లోకసభ ఎన్నికల్లో ఓడించాలని వనపర్తి జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి  అన్నారు.తెలంగాణ రైతు సంఘం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో కల్వరల గ్రామంలో  రైతులతో కలిసి రైతు సంఘం సభ్యత్వం చేపించడం జరిగింది.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్ రెడ్డి మాట్లాడుతూ  జూరాల కాలువ సాగునీరు  రాకపోవడంతో మామిడి తోటలు ఇతర పంటలు ఎండిపోవడం జరుగుతుందని, గోపాల్ దీన్నే రిజర్వాయర్ లో రోజు రోజుకు నీరు తగ్గడంతో  త్రాగునీటి కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి సాగు, తాగునీరుకు నీరు విడుదల చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు సత్యం, రైతు సంఘం గ్రామ నాయకులు రామస్వామి, వెంకటయ్య, నిరంజన్, కృష్ణయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.