గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం

గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం
  • పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యమే కారణం
  • పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తండ్రి వెంకన్న

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దిష్ముఖి గ్రామంలో గల మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అదృష్టమైన సంఘటన మంగళవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నార్కట్పల్లి మండలంలోని నెమ్మని గ్రామానికి చెందిన రూపని వెంకన్న కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రూపని చరణ్ 8 వ తరగతి ,చిన్న కొడుకు రూపని గౌతమ్ 6 వ తరగతి.

అయితే 8వ తరగతి చదువుతున్న రూపని చరణ్ మంగళవారం మధ్యాహ్నం నుండి కనిపించకపోవడంతో అతని సోదరుడు రూపని గౌతమ్ తండ్రి వెంకన్నకు ఫోన్ చేసి అన్న కనిపించడం లేదని సమాచారం ఇచ్చాడు. వెంటనే తండ్రి వెంకన్న పాఠశాల వద్దకు చేరుకొని పరిసర ప్రాంతాలు వెతికారు. అయినా కనిపించకపోవడంతో పాఠశాల యజమాన్యాన్ని  ప్రశ్నించారు.దీంతో మీరు చెప్పేంతవరకు మాకు కూడా తెలియదని పాఠశాల యజమాన్యం సమాధానం ఇచ్చారని, పాఠశాల నిర్లక్ష్యం కారణంగానే చరణ్ అదృశ్యమయ్యారని తండ్రి వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తండ్రి వెంకన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.