మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు ... హైడ్రా కమిషనర్ రంగనాథ్

మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు ... హైడ్రా కమిషనర్ రంగనాథ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని మధురా నగర్ లో తాము నివాసముంటున్న ఇల్లు బఫర్ జోన్ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. నాలుగు దశాబ్ధాల (1980)క్రితం తమ తండ్రి ఏపీవీ సబ్బయ్య ప్రస్తుతం తాముంటున్న ఇంటిని నిర్మించారని ఆయన తెలిపారు. కృష్ణకాంత్ పార్కు దిగువన ఉన్న వేలాది ఇళ్ళ తర్వాత తమ ఇల్లు ఉందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి నిర్మించి ఈ ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని సోషల్ మీడియాతో పాటు కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తల్లో వాస్తం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఒకప్పటి పెద్ద చెరువునే  రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందనని అన్నారు.  అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కిందన వున్న  నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావన్నారు. చెరువు కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో తాము నివాసం వుంటున్న యిల్లు వుందన్నారు.  వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని తాను  ఖండిస్తున్నానని రంగనాథ్ పేర్కొన్నారు.