యమపాశంల వేలాడుతున్న విద్యుత్ తీగలు– పట్టించుకునే వారేరి

యమపాశంల వేలాడుతున్న విద్యుత్ తీగలు– పట్టించుకునే వారేరి
  • మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆందోళన

ముద్ర.వీపనగండ్ల:- మండల పరిధిలోని వివిధ గ్రామాలలో విద్యుత్ తీగలు యమపాశంలో వేలాడుతున్న సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఎవరివైనా ప్రాణాలు పోతే తప్ప స్పందించరా అని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కమలేశ్వర్ రావు అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. సర్పంచ్ల పదవీకాలం ఈనెల చివరినాటికి ముగిస్తుండటంతో ఇప్పటికైనా తాము చెప్పిన పనులను పూర్తిచేయాలని పలువురు సర్పంచులు అధికారుల దృష్టికి తెచ్చారు, బొల్లారం ఎస్సీ కాలనీలో 11 కెవి విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్న పట్టించుకోవడంలేదని, గోపాల్ దిన్నె పాఠశాల పై విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని, వర్షాకాలంలో ఎర్త్ రావడంతో పలువురు విద్యార్థులు విద్యుత్ శాఖ గురయ్యారని విద్యుత్ తీగలు మార్చమని పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చిన పట్టించుకోవటం లేదని సర్పంచులు పద్మమ్మ, విజయ్ కుమార్ లు అన్నారు.

సంగినేనిపల్లిలో కరెంట్ పోల్స్ పాడైపోయి ప్రమాదకరంగా ఉన్నాయని తాను కొత్తగా సర్పంచ్ పదవిని చేపట్టినప్పుడు చెబితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని సర్పంచ్ మౌలాలి ఆవేదన వ్యక్తం చేశారు,హరితహారం లో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తే ఇప్పటికీ వాటికి సంబంధించిన నిధులు రాలేదని సర్పంచ్ విజయ్ కుమార్ సభ దృష్టికి తెచ్చారు, గ్రామాలలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తే అందుకు సంబంధించిన డబ్బులు ఇంతవరకు రాలేదని సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్నారు. వల్లభాపూర్ తండాలో రేషన్ దుకాణం లేకపోవడం వల్ల నాలుగు కిలోమీటర్ల దూరంలోని వల్లభాపురం గ్రామానికి వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుందని, వేసవికాలంలో రేషన్ కి వెళ్లే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, గ్రామంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని సర్పంచ్ అంజయ్య కోరారు.

జూరాల భీమా కాల్వలో సిల్ట్ కంపచెట్లు పెరగడం వల్ల నీటి ప్రవాహం ముందుకు వెళ్ళటం ఇబ్బందిగా ఉందని ఉపాధి హామీ ద్వారా పనులు చేపట్టాలని పలువురు సర్పంచులు కోరారు. వీపనగండ్ల– గోవర్ధనగిరి గ్రామాల మధ్య బిటి రోడ్డు నిర్మాణం పూర్తయిన  ఆర్టీసీ బస్సు రాకపోవడంతో గోవర్ధనగిరి గోపాలదిన్నె గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని, గోపాల్ దిన్నె గ్రామంలోని విద్యార్థులు గోవర్ధనగిరి పాఠశాలకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచులు నరసింహారెడ్డి, విజయ్ కుమార్, చంద్రకళ కోరారు. కొర్లకుంట బొల్లారం గ్రామాల మీదుగా కొల్లాపూర్ వనపర్తి పట్టణాలకు వెళ్లే ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని సర్పంచ్ పద్మమ్మ కోరారు. వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ వారి శాఖలకు సంబంధించిన ప్రగతిని చదివి వినిపించారు. కార్యక్రమంలో తాసిల్దార్ వరలక్ష్మి, ఎంపిడిఓ కథలప్ప, జడ్పిటిసి మాధురికిరణ్ గౌడ్, తూముకుంట సొసైటీ చైర్మన్ రామన్ గౌడ్ తదితరులు ఉన్నారు.