కార్మికులపై కక్షసాధింపు మానుకోవాలి

కార్మికులపై కక్షసాధింపు మానుకోవాలి

కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ గేట్ మీటింగ్ లో రఘునాథ్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి బొగ్గు గనులపై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరిన కార్మికులపై యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరించడం తగదని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ డివిజన్ లోని సిహెచ్పి వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో రఘునాథరావు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గనులపై అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతుండగా వాటిని పరిష్కరించాలని సామరస్యంగా కోరిన కార్మికులను టార్గెట్ చేస్తూ బదిలీలు చేయడం లేదా వేధింపులకు గురిచేస్తుందని ఆయన మండిపడ్డారు.

సింగరేణి కార్మికులకు గనులపై కనీస వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం చెందారని అన్నారు. ఎండలో పనిచేస్తున్న కార్మికులకు తాగడానికి మంచినీళ్లు, మజ్జిగ వంటి సదుపాయాలు ఏర్పాటు  చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే బీఎంఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిఎమ్ఎస్ నాయకుడు పేరం రమేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.