కామారెడ్డి జిల్లాలో విషాదం…హెడ్ కానిస్టేబుల్ మృతి
ముద్ర,తెలంగాణ:- కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడ్వా మండలం దేవాయిపల్లి గ్రామ శివారు ఈ తెల్లవారు జామున లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్ మృతి చెందాడు.తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం కామారెడ్డి నుంచి తాడ్వాయి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు. ఈఘటన పై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.