హైదరాబాద్ లో భారీ వర్షం...హెచ్చరికలు జారీ

హైదరాబాద్ లో భారీ వర్షం...హెచ్చరికలు జారీ

ముద్ర, హైదరాబాద్:-హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈక్రమంలో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద నీటిని తొలగించేందుకు DRF సిబ్బంది కృషి చేస్తున్నట్లు GHMC తెలిపింది. ఎలాంటి సమస్యలున్నా 040-21111111, 9000113667 ఫోన్ చేయాలని తెలిపింది. ద్విచక్ర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. వర్షం తగ్గే వరకూ బయటకెళ్లకపోవడమే మంచిది.