రైస్ మిల్లులో హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ తనిఖీ

రైస్ మిల్లులో హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ తనిఖీ

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని మాందాపూర్ గ్రామంలో మీనాక్షి రైస్ మిల్లును హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ విమల కుమార్ జైన్ శుక్రవారం తనిఖీ చేశారు. ప్రభుత్వానికి పెట్టాల్సిన సీఎంఆర్ బియ్యంలో  అవకతవకలు జరిగాయని అధికారులు మిల్లు యజమానులపై కేసు నమోదు చేశారు. ఇట్టి విషయంపై మిల్లు యజమాని పరమేశ్వర్ రెడ్డి తనపై రాజకీయ కక్షా సాధింపులో భాగంగానే రైస్ మిల్లును  తనిఖీలు చేస్తూ అధికారులు,పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని యజమాని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

రైస్ మిల్లుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కేటాయించిన CMR బియ్యంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, బియ్యం బస్తాలు మిల్లులోనే ఉన్నాయని ఉద్దేశపూర్వకంగానే కేసును నమోదు చేస్తున్నారని హైకోర్టులో మిల్లు యజమాని పిటిషన్ వేయడంతో హైకోర్ట్ అడ్వకేట్ కమిషనర్ను తనిఖీకి పంపించడంతో రైస్ మిల్లులో ఉన్న వరి బస్తాలను లెక్కించారు.

పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించడం జరుగుతుందని కేసు కోర్టులో ఉన్నందున ఎలాంటి విషయాలను వెల్లడించకూడదని అడ్వకేట్ కమిషన్ తెలిపారు. తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు పౌరసరఫరాల శాఖ అధికారులు బాలు, ఫరీద బేగం, నందకిషోర్,వేణు, డి.ఎస్.పి ఆనంద రెడ్డి, ఎస్ఐ వేణు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.